కేవలం పదో తరగతి అర్హతతో ఐటిబిపిలో 545 కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలు | ITBP Constable Driver Notification 2024

కొంతమందికి సైన్యంలో ఏదో ఒక ఉద్యోగంలో చేరాలనే కోరిక ఉంటుంది కాని సరైన విద్యార్హత లేని కారణంగా తమ కలలను నెరవేర్చుకోకుండా మిగిలిపోతుంటారు. ముఖ్యంగా ఎవరైతే పదో తరగతి వరకు మాత్రమే చదువుకుని తర్వాత చదువును మానేసి ఉంటారో అలాంటి వారు ఏదో చిన్న చితక పనులను చేస్తూ ఉంటారు. అలాంటివారిలో ఎవరికైతే పదో తరగతి చదువుతో పాటు హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో అలాంటి పురుషులకి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) లో కానిస్టేబుల్ (డ్రైవర్) గా చేరే సువర్ణావకాశం లభిస్తోంది. ఐటిబిపి 13 సెప్టెంబర్ 2024న కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ (ITBP Constable Driver Notification 2024) విడుదల చేసింది. అలాగే 08 అక్టోబర్ 2024న పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఐటిబిపి తమ నోటిఫికేషన్లో ఇంగ్లీష్‍లో వివరించిన విధంగా పూర్తి సమాచారాన్ని మీకు అర్థమయ్యే విధంగా ఈ ఆర్టికల్‍లో వివరించడం జరిగింది. ఎవరైతే పదో తరగతి పాసై హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటారో వారు మిగిలిన అన్ని అర్హతలు అఫీషియల్ నోటిఫికేషన్‍లో చెప్పిన విధంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టులకు దరఖాస్తును ఆన్‌లైన్‌లో మాత్రమే చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ 2024 అక్టోబర్ 8న ప్రారంభమవుతుంది మరియు 2024 నవంబర్ 6న ముగియనుంది. కాబట్టి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ గడువు తేదీలలో దరఖాస్తు పూర్తి చేసుకోవాలి.

ఐటిబిపిలో 545 కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలు కేవలం పదో తరగతి అర్హతతో | ITBP Constable Driver Notification 2024

ఇక్కడ మీకు ఇంకో ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి. అదే ఈ కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలు ప్రస్తుతానికి తాత్కాలిక బేసిస్‍పై నియమించబడతాయి. వివరంగా చెప్పాలంటే, ఇవి ప్రస్తుతం పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. అయితే భవిష్యత్తులో పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలుగా మారే అవకాశం ఉందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అంటే, మీరు మంచి పనితనం చూపిస్తే, ప్రస్తుతం చేస్తున్న కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగం పర్మనెంట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి.

ITBP Constable Driver Notification 2024 – ముఖ్యాంశాలు:

ఐటిబిపిలో చిన్న చిన్న పనులకు కూడా కానిస్టేబుల్ స్థాయి వారు ఉంటారు. అందులో భాగంగా, ఐటిబిపికి చెందిన భారీ వాహనాలను నడిపేందుకు డ్రైవర్లు కూడా కానిస్టేబుల్ స్థాయిలోనే నియమించబడతారు. వీరిని కూడా ఐటిబిపి తరచూ ఇలాంటి రిక్రూట్మెంట్ ద్వారా సెలెక్ట్ చేస్తుంటుంది. కాబట్టి మీరు డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నా, మీ ర్యాంక్ కానిస్టేబుల్ స్థాయిలోనే ఉంటుంది. ఐటిబిపి కానిస్టేబుల్ (డ్రైవర్) రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్‌లో ఉన్న ముఖ్యమైన వివరాలను కింద పట్టికలో క్లుప్తంగా, సులభంగా అర్థమయ్యేలా అందించడం జరిగింది.

రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP)
పరీక్ష పేరు ఐటిబిపి కానిస్టేబుల్ (డ్రైవర్) రిక్రూట్‌మెంట్-2024
కేటగిరీ తాజా ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టు పేరు కానిస్టేబుల్ (డ్రైవర్) (కేవలం పురుషులు మాత్రమే)
అర్హత వయస్సు 21 నుండి 27 సంవత్సరాల మధ్య
ఖాళీలు 545
వేతనం రూ.21,700/- నుండి రూ.69,100/-
దరఖాస్తు విధానం ఆన్‍లైన్‍లో
దరఖాస్తు ఫీజు GEN/EWS/OBC – రూ.100/-
SC/ST/ESM – ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేది అక్టోబర్ 08, 2024
దరఖాస్తు ముగింపు తేది నవంబర్ 06, 2024
విద్యార్హత పదో తరగతి
ఎంపిక ప్రక్రియ శారీరక సామర్థ్య పరీక్ష (PET), శారీరక ప్రమాణాల పరీక్ష (PST), లిఖిత పరీక్ష, పత్రాల ధృవీకరణ, నైపుణ్య పరీక్ష (డ్రైవింగ్ టెస్ట్), వైద్య పరీక్ష
పరీక్ష మోడ్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‍లైన్
పరీక్ష నిర్వహించే భాష ఇంగ్లీష్, హిందీ
ప్రశ్నల రకం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్
అప్లై లింక్ ఇక్కడ క్లిక్ చేయండి
నోటిఫికేషన్ (PDF) ఇక్కడ క్లిక్ చేయండి
అఫీషియల్ వెబ్‌సైట్ ఇక్కడ క్లిక్ చేయండి

వేతనం/ జీతం:

ఈ కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి వేతనం 7వ సీపీసీ ప్రకారం లెవెల్-3 గా ఉంటుంది, దాంతో వేతన పరిధి రూ. 21,700 నుండి రూ. 69,100 వరకు ఉంటుంది. ఈ స్థాయిలో నియమితులయ్యే అభ్యర్థులకు డీఏ (Dearness Allowance), రేషన్ మనీ అలవెన్స్, ప్రత్యేక సదుపాయ భత్యం (సరిహద్దు ప్రాంతాలలో పనిచేసేటప్పుడు), ఉచిత వసతి లేదా హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), రవాణా భత్యం, లీవ్ ట్రావెల్ కన్సెషన్, మరియు ఉచిత వైద్య సదుపాయాల వంటి అనేక ఇతర భత్యాలు లభిస్తాయి. అదనంగా, 2004 జనవరి 1 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అమలులో ఉన్న కొత్త పునర్నిర్మించిన నిర్దిష్ట సహకార పెన్షన్ పథకంలో ఈ ఉద్యోగులు చేరుకుంటారు, ఇది భవిష్యత్తులో వారి ఆర్థిక భద్రతను మెరుగుపరుస్తుంది.

మంచిగానే ఉంది కదూ! నెలవారీ జీతంతో పాటు ఇలాంటి ఎన్నో రకాల సదుపాయాలు ఉండడం వల్ల ఈ ఉద్యోగం చాలా ఆకర్షణీయంగా మారుతుంది. డీఏ, రేషన్ మనీ భత్యం, ప్రత్యేక సదుపాయ భత్యం, ఉచిత వసతి, రవాణా భత్యం, మరియు వైద్య సదుపాయాలు లాంటి ప్రయోజనాలు ఉద్యోగి ఆర్థిక భద్రతను బలపరుస్తాయి. అంతేకాక, ప్రభుత్వ ఉద్యోగం కావడంతో పనిలో స్థిరత్వం కూడా ఉంటుంది. అందువల్ల, ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు అనేక మందిని ఆకర్షిస్తూ, వారి జీవితంలో భద్రత, స్థిరత్వం కల్పించగలిగే విశ్వాసాన్ని ఇస్తాయి.

ఖాళీల సంఖ్య:

కేవలం పదో తరగతి అర్హతతో ఇంత మంచి వేతనం మరియు ఇతర ప్రయోజనాలు కలిగిన ఈ ఉద్యోగం చాలా మందికి ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే, ఈ రిక్రూట్మెంట్ దేశవ్యాప్తంగా విడుదల చేయబడినందున, భారీ స్థాయిలో పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 545 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు ఉన్నాయి, మరియు ఇవి కేటగిరీల వారీగా కింద పేర్కొన్న విధంగా ఉంటాయి.

  • జనరల్ – 209
  • ఎస్.సి – 77
  • ఎస్.టి – 40
  • ఓ.బి.సి – 164
  • ఈ.డబ్ల్యూ.ఎస్ – 55
  • మొత్తం – 545

విద్యార్హత:

ఈ మధ్య కాలంలో పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటున్నాయి. అలాగే ఏవైనా పదో తరగతి అర్హతతో నోటిఫికేషన్లు విడుదలైతే చాలు అమ్మో బాబోయ్ డిగ్రీలు, పీజీలు, పిహెచ్‍డీలు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. అందుకే పదో తరగతి తర్వాత చదువు మానుకున్నవారు చాలా అరుదుగా ప్రభుత్వ ఉద్యోగాలు కొడుతుంటారు. ఇక ఈ కానిస్టేబుల్ (డ్రైవర్) రిక్రూట్మెంట్ కూడా పదో తరగతి అర్హత ఉన్నవారికి కావడంతో పోటి ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ ఉద్యోగానికి అర్హత కేవలం పదో తరగతి మాత్రమే కాదండోయ్, దీంతో పాటు వారు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. దానికి కూడా టెస్ట్ ఉంటుంది.

అర్హత వయస్సు:

ITBP కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2024 నవంబర్ 6 నాటికి 21 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అంటే, 07.11.1997 మరియు 06.11.2003 మధ్య జన్మించిన వారే అర్హులు. ఈ వయసు పరిమితి అభ్యర్థుల శారీరక సామర్థ్యాన్ని, ఉద్యోగ బాధ్యతలకు తగిన అనుభవాన్ని పరిశీలించి నిర్ణయించబడింది. అదనంగా, రిజర్వుడ్ కేటగిరీలకు ఉన్న సడలింపులు ప్రభుత్వ నియమావళి ప్రకారం వర్తిస్తాయి, ఇది మరింత మంది అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తుంది.

దరఖాస్తు ఫీజు:

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, ముఖ్యంగా జనరల్ (UR), ఓబీసీ మరియు ఈడబ్ల్యుఎస్ కేటగిరీలకు చెందిన వారు, రూ. 100/- దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు కోసం అభ్యర్థులు recruitment.itbpolice.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ చెల్లింపు గేట్‌వే ద్వారా చెల్లించాలి. అలాగే, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు మాజీ సైనికులు వంటి ప్రత్యేక కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఈ దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది, అంటే వారు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం:

ఈ ఐటిబిపి కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వడం అంత సులభం కాదు. ఎందుకంటే సెలెక్షన్ ప్రాసెస్‌లో పలు దశలు ఉంటాయి. మొదటగా, అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) ను పూర్తి చేయాలి. అలా దాటాక, రాత పరీక్షలో మంచి మార్కులు సాధించాల్సి ఉంటుంది. అందువల్ల, చివరిగా మెడికల్ పరీక్షలో ఫెయిల్ అయితే, మీరు ఇప్పటికే పూర్తి చేసిన అన్ని దశలు వ్యర్థం అవుతాయి. ఈ సెలెక్షన్ ప్రాసెస్‌లో అనేక కీలక దశలు ఉన్నాయి, అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • శారీరక సామర్థ్య పరీక్ష (PET)
  • శారీరక ప్రమాణాల పరీక్ష (PST)
  • లిఖిత పరీక్ష
  • ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
  • నైపుణ్య పరీక్ష (డ్రైవింగ్ టెస్ట్)
  • వైద్య పరీక్ష

1. శారీరక సామర్థ్య పరీక్ష (PET):

ఇక ఈ శారీరక సామర్థ్య పరీక్ష గురించి మాట్లాడుకుంటే, ఇదే సెలెక్షన్ ప్రాసెస్‌లో మొదటి దశ. ఎవరైతే ఈ కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుని ఉంటారో వారు మొదటగా ఈ శారీరక సామర్థ్య పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో ఈ క్రింది పోటీలు ఉంటాయి. వీటన్నిటిలో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే తర్వాతి దశకు చేరుకుంటారు.

  • 1.6 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • 11 ఫీట్ల లాంగ్ జంప్‍ని 3 ప్రయత్నాల్లో మరియు
  • 3.5 ఫీట్ల హై జంప్‍ని 3 ప్రయత్నాల్లో (అటెమ్స్) పూర్తి చేయాలి.

2. శారీరక ప్రమాణాల పరీక్ష (PST):

ఎవరైతే శారీరక సామర్థ్య టెస్ట్‌లో అర్హత సాధిస్తారో, వారు తర్వాత దశ అయిన శారీరక ప్రమాణాల టెస్ట్‌కి సిద్ధంగా ఉండాలి. ఈ దశలో పురుషుల శారీరక ప్రమాణాలను కొలుస్తారు. ఈ ప్రమాణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. ఈ ప్రమాణాలలో కొన్ని ప్రత్యేక కేటగిరీలకు తగ్గించడం జరిగింది, కాబట్టి ఆ కేటగిరీలకు సంబంధిత వివరాలను తెలుసుకోవాలంటే ఆఫీషియల్ నోటిఫికేషన్‌ను చూడండి. ఇక్కడ అందించబడిన శారీరక ప్రమాణాలు మిగతా అభ్యర్థులకే వర్తిస్తాయి; కేటగిరీలకు మినహా ఇతరుల కోసం మాత్రమే ఇది వర్తిస్తుంది.

  • పొడవు: 170 సెంటీమీటర్లు
  • ఛాతి వెడల్పు: 80 సెంటీమీటర్లు (గాలిని తీసుకుంటే 85 సెంటీమీటర్లు)
  • భారం: పొడవుకు అనుగుణంగా ఉండాలి.

3. లిఖిత పరీక్ష:

ఇక లిఖిత పరీక్ష విషయానికి వస్తే, పరీక్ష నిర్వహణ విధానం OMR-బేస్డ్ లేదా కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ (CBT)గా ఉండనుంది, దీనిని ITBP నిర్ణయిస్తుంది. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహించబడుతుంది, ఇది ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయస్ ప్రశ్నలతో (హిందీ మరియు ఇంగ్లీష్) ఉంటుంది. లేఖిత పరీక్షలో కనీస అర్హత స్కోరు సాధారణ, ఈడబ్ల్యుఎస్ మరియు మాజీ సైనికులకు 35% మార్కులు కాగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (NCL) అభ్యర్థులకు కనీసం 33% మార్కులు వచ్చి ఉండాలి. ఈ పరీక్ష విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది:

  • సబ్జెక్ట్స్:
    • జనరల్ నాలెడ్జ్: 10 ప్రశ్నలు, 10 మార్కులు
    • సాధారణ హిందీ లేదా సాధారణ ఇంగ్లీష్: 20 ప్రశ్నలు, 20 మార్కులు
    • గణితము: 10 ప్రశ్నలు, 10 మార్కులు
    • వాణిజ్యం (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) సంబంధిత సిధ్దాంతం: 60 ప్రశ్నలు, 60 మార్కులు
  • మొత్తం: 100 ప్రశ్నలు, 100 మార్కులు
  • కాల వ్యవధి: 2 గంటలు

4. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్:

ఎవరైతే లిఖిత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారో వారు తదుపరి దశ అయిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కు చేరుకుంటారు. ఈ దశలో, అభ్యర్థుల వాస్తవ విద్యా మరియు వయసు ధ్రువపరిచే కాగితాలను పరిశీలిస్తారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ ధృవపత్రాలను సమర్పించాలి. ఒక వేళ వారు అడిగిన అన్ని ధృవపత్రాలను చూపించకుంటే , అభ్యర్థులు తదుపరి దశలకు వెళ్లడానికి అర్హత పొందరు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో అభ్యర్థుల యొక్క స్కూల్ సర్టిఫికేట్లు, జన్మ సర్టిఫికేట్లు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కీలకమైన కాగితాలు పరిశీలించబడతాయి, అందువల్ల అన్ని అభ్యర్థులు అన్ని ఒరిజినల్ పత్రాలతో పాటు వాటికి సంబంధించిన జిరాక్స్ పత్రాలను కూడా సన్నద్ధంగా పెట్టుకోవాలి.

5. నైపుణ్య పరీక్ష (డ్రైవింగ్ టెస్ట్):

ఐటిబిపి కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్ట్‌కు అర్హత పొందడానికి, అభ్యర్థులు నైపుణ్య పరీక్షను సమర్ధంగా పాస్ చేయాలి, ఇది డ్రైవింగ్ టెస్ట్‌గా కూడా వ్యవహరిస్తుంది. ఈ పరీక్షలో అభ్యర్థులు భారీ వాహనాలను నడిపే సామర్థ్యాన్ని చూపించాలి. ఈ పరీక్షలో వాహన నియంత్రణ, బాగా నడిపించడం, మరియు ప్రమాద నివారణపై అవగాహన వంటి నైపుణ్యాలను అంచనా వేయబడుతుంది. అభ్యర్థులు తమ డ్రైవింగ్ నైపుణ్యాలను సమర్ధంగా ప్రదర్శించడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం, మరియు వాహన నిర్వహణ సంబంధిత అంశాలలో నైపుణ్యం కలిగి ఉండాలని నిర్ధారించుకోవాలి. ఈ పరీక్షలో విజయం సాధించడం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ముందుకు వెళ్లడానికి కీలకంగా ఉంటుంది.

6. వైద్య పరీక్ష:

అభ్యర్థులు పైన పేర్కొన్న అన్ని టెస్ట్లను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, వారికి వైద్య పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ దశలో, అభ్యర్థుల శారీరక ఆరోగ్యం, శక్తి, మరియు దృఢత్వాన్ని అంచనా వేయడానికి వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు శారీరక సామర్థ్యం, స్థాయిని మరియు నిర్వహణను నిర్ధారించడానికి చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే డ్రైవింగ్ విధుల్లో శారీరక ఆరోగ్యం అత్యంత అవసరం. అభ్యర్థులు అనారోగ్య లేదా శారీరక లోపాలే ఉంటే, వారి ఎంపిక ప్రక్రియకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. వైద్య పరీక్షలను ఉత్తీర్ణం చేయడం, అవకాశాలను పెంచుతుంది. ఇదే చివరి దశ కావడంతో ఎవరైతే ఈ వైద్య పరీక్షలను ఉత్తీర్ణం సాధిస్తారో వారు ఈ ఐటిబిపి ఫోర్స్‌లో కానిస్టేబుల్ డ్రైవర్ గా నియమితులు అయినట్టే.

కావున ఈ ఐటిబిపి కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే వారు ఈ అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేయవలసి ఉంటుంది. ఎవరికైతే పైన పేర్కొనబడిన అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. లేదంటే మీరు ఏ దశలోనైన వెనుదిరగవచ్చు. కావున ఇంకా రెండు మూడు సార్లైన ఈ ఆర్టికల్ ని చదివి మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పక ఈ కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాన్ని దరఖాస్తు చేసుకుని, మీ మాతృభూమికి తమ వంతు సేవ చేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock
Scroll to Top