యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) డిగ్రి చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. దానిని జస్ట్ ఎంప్లాయిమెంట్ న్యూస్ అనొచ్చు కదా అంటారేమో. నిజంగా అది సాధారణ జాబ్ నోటిఫికేషన్ మాత్రం కాదు. ఎందుకంటే దేవుని దయ మరియు మీ టాలెంట్ వల్ల మీకు ఈ ఉద్యోగం వచ్చిదంటే మొదటి నెలనుంచే దాదాపు యాబై వేల రూపాయల జీతం వస్తుంది. ఇంతకి ఏమిటా ఉద్యోగ నోటిఫికేషన్ ముందు అది చెప్పు గాడిదా అంటారేమో, ఇక లేట్ చేయకుండ ఇంతకి యూనియన్ బ్యాంక్ విడుదల చేసిన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ నోటిఫికేషన్ (Union Bank LBO Notification 2024) గురించి మాట్లాడుకుందాం.
అక్టోబర్ 24, 2024న యూనియన్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాతో కలిపి మొత్తం 10 రాష్ట్రాలలో 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (Local Bank Officer) పోస్టుల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగంతో సంబంధం లేకుండా ఫుల్ టైం లేదా రెగ్యులర్ డిగ్రితో పాస్ అయినవారు ఈ ఉద్యోగానికి అన్‍లైన్‍లో దరఖాస్తు చేసుకోవచ్చు. అన్‍లైన్‍లో దరఖాస్తు ప్రక్రియ 24 అక్టోబర్ 2024న మొదలై 13 నవంబర్ 2024న ముగుస్తుంది. ఇక ఈ నోటిఫికేషన్ గురించి సంపూర్ణ సమాచారాన్ని ఈ ఆర్టికల్‍లో క్లుప్తంగా వివరించడం జరిగింది, కావున ఆసక్తిగల అభర్థులు జాగ్రత్తగా మొత్తం చదివి ఒక అవగాహనకు రండి.
విషయ సూచిక:-
మీకు మీ రాష్ట్రంలోని అధికారిక (స్థానిక) భాషపై మంచి పట్టు ఉండి, మంచి కమ్యూనికేషన్ నెపుణ్యాలతో పాటు రాత పరీక్ష నిర్వహిస్తే అందులో రాణించే సామర్థ్యం ఉంటే, ఈ లోకల్ బ్యాంక్ ఆఫిసర్ ఉద్యోగం మీకే అనుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు కొన్నిసార్లు మాత్రమే వస్తున్నాయికాబట్టి, వాటిని వదులుకోకండి.
Union Bank LBO Notification 2024 – ముఖ్యాంశాలు:
యూనియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ నోటిఫికేషన్ లో ఈ రిక్రూట్‌మెంట్ సంబంధించి పూర్తి సమాచారాన్ని 25 పేజీలుగా ఇంగ్లీష్‌లో అందించారు. మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ముఖ్యమైన విషయాలను ఈ క్రింది పట్టికలో ఇవ్వడం జరిగింది. మీరు కేవలం ఈ వివరాలను చూస్తే కూడా మొత్తం ఈ రిక్రూట్‌మెంట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
పరీక్ష పేరు | లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2025-26 |
కేటగిరీ | బ్యాంక్ ఉద్యోగం |
పోస్టు పేరు | లోకల్ బ్యాంక్ ఆఫీసర్ |
అర్హత వయస్సు | 20 నుండి 30 సంవత్సరాల మధ్య |
ఖాళీలు | 1500 |
ఆంధ్ర, తెలంగాణాలో మొత్తం ఖాళీలు | 200+200=400 |
వేతనం | రూ.48,480/- |
దరఖాస్తు విధానం | ఆన్‍లైన్‍లో |
దరఖాస్తు ఫీజు | GEN/EWS/OBC – ₹850 SC/ST/PwBD – ₹175 |
దరఖాస్తు ప్రారంభ తేది | అక్టోబర్ 24, 2024 |
దరఖాస్తు ముగింపు తేది | నవంబర్ 13, 2024 |
విద్యార్హత | ఏదైనా డిగ్రీ |
ఎంపిక ప్రక్రియ | రాత పరీక్ష/ సమూహ చర్చ/ స్క్రీనింగ్, వ్యక్తిగత ఇంటర్వ్యూ, మరియు భాషా నైపుణ్య టెస్ట్ |
పరీక్ష మోడ్ | ఆన్‌లైన్ |
పరీక్ష నిర్వహించే భాష | ఇంగ్లీష్, హిందీ |
ప్రశ్నల రకం | మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ |
అప్లై లింక్ | ఇక్కడ క్లిక్ చేయండి |
నోటిఫికేషన్ (PDF) | ఇక్కడ క్లిక్ చేయండి |
అఫీషియల్ వెబ్‌సైట్ | ఇక్కడ క్లిక్ చేయండి |
వేతనం/ జీతం:
ఈరోజుల్లో ఉద్యోగం దొరకడమే కష్టమయ్యే పరిస్థితులలో ఉన్నాము. దొరికిన కూడా సరైన గుర్తింపు లేదనో, జీతం సరిపోవడం లేదనో, వర్కింగ్ అవర్స్ సరిగ్గా లేదనో ఏదో ఒకటి కారణం చెబుతూ ఉంటాము. ఏది తక్కువ అయిన పర్వాలేదు ఆ పనిని చేసుకుని పోతూ ఉంటాము. కాని జీతం/ వేతనం తక్కవగా తమ పనికి తగ్గట్టుగా లేదంటే మాత్రం చాలామంది అసహనం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఎవ్వరైన నెలంతా కష్టపడి పనిచేసేది, చేసేలా చేసేది ఈ జీతం అనేదే. అందువల్ల అందరూ మొదట చూసేదే శాలరి ఎంత అని. ఆ వ్యక్తికి వచ్చే శాలరి ఆధారంగా కూడా చాలామంది ఆ వ్యక్తికి గౌరవం కూడా ఇస్తారు.
ఇక మిగతా విషయాలు ఎలాగైన ఉండని నాకు మాత్రం మంచి జీతమే మొదటి ప్రిఫరెన్స్ అనుకునే వారికి యూనియన్ బ్యాంక్ యొక్క ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం ఒక మంచి సువర్ణావకాశం. మీరు ఈ ఉద్యోగానికి ఎంపికయితే, మీకు బేసిక్ పే స్కేల్ ఈ విధంగా ఉంటుంది: 48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920.
ఖాళీల సంఖ్య:
ఏటేటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ పోతుంది కాని ఉద్యోగాలు అంతకంతకు తగ్గుతూ వెళుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చినప్పటి నుంచి అయితే, ఎన్నో ఉద్యోగాలకు గ్యారెంటి అనేదే లేకుండా పోయింది. ఇక యూనియన్ బ్యాంక్ అఫీషియల్ నోటిఫికేషన్లో చెప్పిన విధంగా మొత్తం 10 రాష్ట్రాలతో కలిపి 1500 లోకల్ బ్యాంక్ అఫీసర్ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. అంటే ఈ 1500 పోస్టులలో మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో 200 చొప్పున మొత్తం 400 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ మనం ఈ 10 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కేటగెరీలో ఉన్న ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కాని ఆయా రాష్ట్రాల అధికార భాషలలో ప్రావీణ్యం పొంది ఉంటాలి. ఎందుకంటే భాషా నైపుణ్య టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి.
విద్యార్హత:
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు ఫుల్ టైమ్ లేదా రెగ్యులర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, అది ఏ విభాగం అయినా సరే. అంటే, కొంతమంది డిగ్రీని ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పూర్తి చేసుకున్నా వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులే. అలాగే, నోటిఫికేషన్ ప్రకారం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మీ డిగ్రీ 2024 అక్టోబర్ 1 నాటికి పూర్తయి ఉండాలి.
డిగ్రీ చదివిన వారికి ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే, విడుదలయ్యే పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడం మరియు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. ఈ యూనియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు పది రాష్ట్రాల నుండి కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కువ పోటీ ఉంటుంది. ఎందుకంటే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం ఆ రాష్ట్రంలోని అధికారిక భాషపై పట్టు ఉంటే చాలు, వేరే ఏ విధమైన పరిమితులు ఉండవు.
అర్హత వయస్సు:
ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి కొన్ని నిర్దిష్ట వయసు పరిమితులను తప్పనిసరిగా పాటించాలి. 2024 అక్టోబర్ 1 నాటికి మీ వయసు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ వయసు పరిమితి నిర్ణయం, అభ్యర్థుల సామర్థ్యం మరియు ఉద్యోగ అవసరాలను బట్టి తీసుకోబడింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయసు సడలింపులు ఉన్నాయి. దరఖాస్తు చేసే ముందు మీ వయసు అర్హతకు అనుగుణంగా ఉందో లేదో తనిఖీ చేసుకోండి. మీరు ఏదైనా రిజర్వేషన్ కేటగిరీకి చెందినవారైతే, మీకు వర్తించే వయసు సడలింపుల గురించి తెలుసుకోండి. అన్ని వివరాల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ కేటగిరి, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, మరియు ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు రూ. 850/-లను ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. అలాగే, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మరియు బెంచ్‌మార్క్ దివ్యాంగులు దరఖాస్తు ఫీజుగా రూ. 175/-లను చెల్లించాల్సి ఉంటుంది. మీ కేటగిరీకి అనుగుణంగా ఈ ఫీజును చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియలో మీ అప్లికేషన్‌ను విజయవంతంగా సమర్పించడానికి, మీరు ముందుగా ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది; ఆ తర్వాత మాత్రమే మీ అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది. ఫీజు చెల్లించకుండా ఉంచినప్పుడు, మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం ఖాయం, అందువల్ల ఫీజు చెల్లించడం అనేది అత్యంత కీలకం.
ఎంపిక విధానం:
మీరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్లు అయితే ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి. ఈ నియామక ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి, వీటిలో ఆన్‌లైన్ పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ అప్లికేషన్ల స్క్రీనింగ్ మరియు/లేదా వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉండవచ్చు. అంటే దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్యను బట్టి వీటిలో ఏయే నియామక ప్రక్రియలను పాటించాలి అనే సంపూర్ణ అధికారం బ్యాంకుకే ఉంటుంది.
దీనిని అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఒకవేళ దరఖాస్తు చేసుకున్నవాళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటే, వారందరికి కేవలం ఆన్‍లైన్ పరీక్ష పెట్టవచ్చు, లేదా గ్రూప్ డిస్కషన్ లేదా అప్లికేషన్ స్క్రీనింగ్ లేదా ఇంటర్వ్యూ మాత్రమే అయినా పెట్టవచ్చు. అంటే దరఖాస్తుదారుల సంఖ్యను బట్టి సరైన నిర్ణయం బ్యాంకే తీసుకుంటుంది
మీరు పైన పేర్కొన్న సమాచారాన్ని పూర్తిగా చదివి, మీరు ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. లేకపోతే, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అన్ని దశలను పూర్తిచేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో అర్హత లేని దృవపత్రాలతో పట్టు బడితే, మీ అప్లికేషన్ తిరస్కరించబడుతుంది. కాబట్టి, అన్ని సరైన మరియు అవసరమైన దృవపత్రాలతో మాత్రమే దరఖాస్తు చేసుకోవడం చాలా ముఖ్యం.