మీరు ఇన్సూరెన్స్ రంగంలో మీ కెరీర్‌ను నిర్మించాలని ఆశిస్తున్నారా? అయితే, ఈ అద్భుతమైన అవకాశాన్ని వదలకండి! భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటైన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL-National Insurance Company Limited) 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (NICL Assistant Notification 2024) అక్టోబర్ 22న విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ 2024 అక్టోబర్ 24న ప్రారంభమవుతుంది మరియు నవంబర్ 11, 2024 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుంది.
విభాగంతో సంబంధం లేకుండా ఏదైనా డిగ్రీ చేసి ఉండి, 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండే వారు ఎన్‍ఐసిఎల్ సంబంధించిన అధికారిక వెబ్‍సైట్ అయిన nationalinsurance.nic.co.in లో ఈ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కావున మీరు డిగ్రీ చదివి ఉంటే ఈ అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ క్రింద ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి అన్ని అవసరమైన అన్ని వివరాలను కూలంకుశంగా వివరించడం జరిగింది. మీరు మొత్తం ఈ ఆర్టికల్ ను చదివి ఈ రిక్రూట్మెంట్ పై సంపూర్ణ అవగాహనను పెంపొందించుకోండి.

విషయ సూచిక:-
NICL Assistant Notification 2024 – ముఖ్యాంశాలు:
కలకత్తా కేంద్రస్థానంగా పనిచేసే ఈ NICLకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో బ్రాంచ్ లు ఉన్నాయి. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) అనేది భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటి. ఇది వివిధ రకాల ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది, వీటిలో మోటార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్ మరియు మరెన్నో ఉన్నాయి. ఇది తమ కార్యాలయాలలో/ బ్రాంచ్‍లలో ఖాళీగా 500 అసిస్టెంట్ పోస్టులను భర్తి చేసేందుకు అక్టోబర్ 22, 2024న ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మొత్తం ఇంగ్లీష్ లో ఉన్నందున తెలుగువారి కోసం ఆ నోటిఫికేషన్ లోని ముఖ్యమైన విషయాలను ఈ క్రింది పట్టికలో ఇవ్వడం జరిగింది. కావున మీరు ఈ పట్టికలోని విషయాలను చదివి ఈ రిక్రూట్మెంట్ పై సంపూర్ణ అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాను.
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) |
పరీక్ష పేరు | ఎన్‍ఐసిఎల్ అసిస్టెంట్ల (క్లాస్-III) నియామక పరీక్ష – 2024 |
కేటగిరీ | తాజా ప్రభుత్వ ఉద్యోగాలు |
పోస్టు పేరు | అసిస్టెంట్ |
అర్హత వయస్సు | 21 నుండి 30 సంవత్సరాల మధ్య |
ఖాళీలు | 500 |
వేతనం | రూ.22,405 – రూ.62,265 |
దరఖాస్తు విధానం | ఆన్‍లైన్‍లో |
దరఖాస్తు ఫీజు | SC/ST/PwBD/EXS: ₹100 ఇతరులు: రూ.850/- |
విద్యార్హత | ఏదైనా డిగ్రీ |
దరఖాస్తు ప్రారంభ తేది | అక్టోబర్ 24, 2024 |
దరఖాస్తు ముగింపు తేది | నవంబర్ 11, 2024 |
పరీక్ష తేదీలు | ప్రిలిమ్స్: 30-11-2024 మెయిన్స్: 28-12-2024 |
ఎంపిక ప్రక్రియ | ప్రిలిమ్స్, మెయిన్స్, ప్రాంతీయ భాషా పరీక్ష |
పరీక్ష విధానం | ఆన్‌లైన్ |
పరీక్ష భాష | ఇంగ్లీష్, హిందీ |
ప్రశ్నల రకం | మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ |
అప్లై లింక్ | ఇక్కడ క్లిక్ చేయండి |
నోటిఫికేషన్ (PDF) | ఇక్కడ క్లిక్ చేయండి |
అఫీషియల్ వెబ్‌సైట్ | ఇక్కడ క్లిక్ చేయండి |
ఖాళీల వివరాలు:
NICL అసిస్టెంట్ (క్లాస్-III) ఉద్యోగంలో ఎంపికైన అభ్యర్థులు పలు కార్యాలయ పనులు నిర్వహిస్తారు. వీటిలో కస్టమర్లతో సంప్రదించడం, వారి సందేహాలను పరిష్కరించడం, పాలసీలు జారీ చేయడం, క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడం, పత్రాలను నిర్వహించడం, మరియు ఇతర పరిపాలనా పనులు చేయడం ముఖ్యమైనవి. ఈ పోస్టులో ఎంపికైన అభ్యర్థులు సంస్థ సజావుగా నడుస్తూ, కస్టమర్ సేవను మెరుగుపరిచే విధంగా సహకరిస్తారు. NICL అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2024లో మొత్తం 500 పోస్టులను భర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 21 పోస్టుల ఖాళీలు ఉండగా, తెలంగాణాలో 12 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఈ పోస్టులను అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల వారిగా ఈ క్రింద ఇవ్వడం జరిగింది.
- ఆంధ్రప్రదేశ్: 21
- తెలంగాణ: 12
- అరుణాచల్ ప్రదేశ్: 1
- అస్సాం: 22
- బీహార్: 10
- ఛత్తీస్‌గఢ్: 15
- గోవా: 3
- గుజరాత్: 30
- హర్యానా: 5
- హిమాచల్ ప్రదేశ్: 3
- జార్ఖండ్: 14
- కర్నాటక: 40
- కేరళ: 35
- మధ్యప్రదేశ్: 16
- మహారాష్ట్ర: 52
- మణిపూర్: 1
- మేఘాలయ: 2
- మిజోరం: 1
- నాగాలాండ్: 1
- ఒడిశా: 10
- రాజస్థాన్: 10
- పంజాబ్: 35
- సిక్కిం: 1
- తమిళనాడు: 35
- త్రిపుర: 2
- ఉత్తరప్రదేశ్: 16
- ఉత్తరాఖండ్: 12
- పశ్చిమబెంగాల్: 58
- అండమాన్ & నికోబార్ దీవులు: 1
- చండీగఢ్: 3
- ఢిల్లీ: 28
- జమ్మూ & కాశ్మీర్: 2
- లడఖ్: 1
- పుదుచ్చేరి: 2
- మొత్తం: 500
మీరు పైన పేర్కొన్న ఏ రాష్ట్రంలో నైన దరఖాస్తు చేసుకోవచ్చు. కాని మీకు ఆ రాష్ట్రాలలోని అధికార భాషపై పట్టు ఉండాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ మరియు మేన్స్ పరీక్షలు క్వాలిఫై అయినవారు ఖచ్చితంగా ఎన్.ఐ.సి.ఎల్ నిర్వహించే ప్రాంతీయ భాషా పరీక్షలో ఉత్తిర్ణత సాధించాలి.
వేతనం/ జీతం:
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) లో అసిస్టెంట్ ఉద్యోగస్తులకు నెలకు రూ. 22,405 నుండి రూ. 62,265 వరకు జీతం ఉంటుంది, అందులో వివిధ ఇంట్రిమెంట్‌లు కలుస్తాయి. అలాగే ఒకవేళ మీరు మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో, అంటే హైదరాబాద్, బెంగళూర్, ముంబాయి, డిల్లీ మొదలైన ప్రాంతాల్లో పనిచేస్తే మీకు మొదటి నెల నుంచే సుమారు రూ. 39,000 అందుకుంటారు. ఇది విధులున్న ప్రదేశాన్ని ఆధారపడి అలవెన్సులతో సహా ఉంటుంది. జీతంతో పాటు డోమెసిలరీ మెడికల్ బెనిఫిట్, గ్రూప్ మెడిక్లెయిమ్, లీవ్ ట్రావెల్ సబ్సిడీ, మరియు ఇతర సంక్షేమ పథకాలు లభిస్తాయి.
విద్యార్హత:
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో అసిస్టెంట్‌గా పని చేయాలనుకునే వాళ్ళు కొన్ని కనీస అర్హతలు కలిగి ఉండాలి. ముందుగా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఏ సబ్జెక్ట్‌లో అయినా పర్వాలేదు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఇతర డిగ్రీలు కూడా అర్హతగా పరిగణించబడతాయి. అంతేకాదు, 2024 అక్టోబర్ 1 వారు తమ డిగ్రీను చేసి ఉండాలి. ఈ అర్హతలు ఎందుకు అంటారా? ఏదైనా డిగ్రీ ఉంటే వాళ్ళు మంచిగా చదువుకున్న వాళ్ళు అని అర్థం. పరీక్షలో పాస్ అయితే వాళ్ళకు ఈ ఉద్యోగం చేయడానికి కావలసిన జ్ఞానం ఉందని అర్థం.
అర్హత వయస్సు:
NICL అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కోసం వయోపరిమితులు ఉన్నాయి. కనిష్ట వయస్సు 21 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 2024 అక్టోబర్ 1 నాటికి 30 సంవత్సరాలు ఉండాలి. అభ్యర్థులు 1994 అక్టోబర్ 2 నుండి 2003 అక్టోబర్ 1 మధ్య పుట్టాలి. కొన్ని కేటగిరీలకు వయోనివరణలు అందుబాటులో ఉన్నాయి, అందులో షెడ్యూల్డ్ కాస్తులు మరియు తెగలకు 5 సంవత్సరాలు, ఇతర వెనుకబడిన కేటగిరీలకు 3 సంవత్సరాలు, మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాలు పెరుగుతాయి.
దరఖాస్తు ఫీజు:
ఈ అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారికి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. దీనిని వారు ఆన్‍లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. మీరు SC/ST/PwBD/EXS కేటగిరీలకు చెందినవారైతే ₹100 మరియు ఇతర అభ్యర్థులకు ₹850 ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు 2024 అక్టోబర్ 24 నుండి నవంబర్ 11 వరకు చెల్లించడానికి గడువును నిర్దేశించారు. కావున ఆసక్తిగలవారు తొందరగా ఫీజు చెల్లించండి. లేకపోతే మీ అప్లికేషన్ తిరస్కరించబడును.
ఎంపిక విధానం:
NICL అసిస్టెంట్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మూడు ప్రధాన దశలతో ఉంటుంది: ప్రాథమిక పరీక్ష, ప్రధాన పరీక్ష, మరియు ప్రాంతీయ భాషా పరీక్ష. మొదట, అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రాథమిక పరీక్షలో పాల్గొనాలి. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు, ప్రధాన పరీక్షకు ఎంపిక అవుతారు. తర్వాత, ప్రధాన పరీక్షలో ర్యాంకు సాధించిన అభ్యర్థులకు, ప్రాంతీయ భాషా పరీక్షకు పిలువబడతారు. ఈ పరీక్ష కేవలం అర్హత సాధన కోసం మాత్రమే ఉంటుంది.
- ప్రాథమిక పరీక్ష: ఇది ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది మరియు 100 మార్కులకు మల్టీపుల్-చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులకు 60 నిమిషాలలో ఈ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష మూడు విభాగాలను కలిగి ఉంటుంది: ఆంగ్ల భాష (30 ప్రశ్నలు, 30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ (35 ప్రశ్నలు, 35 మార్కులు) మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (35 ప్రశ్నలు, 35 మార్కులు). ప్రతి విభాగంలో కూడా అభ్యర్థులు పాసింగ్ మార్కులను సాధించాలి, అవి కంపెనీ ద్వారా నిర్ణయించబడతాయి. ఈ దశలో, 15 రెట్లు అభ్యర్థులను ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తారు, తద్వారా సంస్థ మెరుగైన అర్హత కలిగిన వ్యక్తులను గుర్తించగలదు.
- ప్రధాన పరీక్ష: ప్రధాన పరీక్ష 200 మార్కులకు 2 గంటల పాటు నిర్వహించబడుతుంది, ఇందులో ఐదు విభాగాలు ఉంటాయి: రీజనింగ్ పరీక్ష (40 ప్రశ్నలు, 40 మార్కులు), ఆంగ్ల భాష (40 ప్రశ్నలు, 40 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ (40 ప్రశ్నలు, 40 మార్కులు), జనరల్ అవేర్నెస్ (40 ప్రశ్నలు, 40 మార్కులు), మరియు కంప్యూటర్ అవగాహన (40 ప్రశ్నలు, 40 మార్కులు). ఈ పరీక్షకు 120 నిమిషాలు సమయమిచ్చారు.
- ప్రాంతీయ భాష పరీక్ష: ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రాంతీయ భాష పరీక్షకు పిలవబడతారు. ఈ పరీక్ష అర్హత సాధించడంలో ప్రాధమికంగా ఉండగా, ప్రత్యేక మార్కులు ఇవ్వబడవు. కావున ఇంతకు ముందే చెప్పినట్టు మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే పరీక్ష అందరికి ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది కనుక. అలాగే మీకు ఆయా రాష్ట్రాల అధికారిక భాషపై పట్టు కూడా ఉండేలా చూసుకోండి. ఫైనల్ ఎంపిక ప్రధాన పరీక్ష మరియు ప్రాంతీయ భాష పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ఎటువంటి మార్కుల సమానత్వం ఏర్పడితే, వయస్సులో పెద్దవారిని ప్రాధాన్యం ఇస్తారు.
- పత్రాల ధృవీకరణ: అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలో అవసరమైన పత్రాలను అందించాలి. ఈ దశలో సరైన మరియు సక్రమమైన సమాచారాన్ని అందించడం చాలా ముఖ్యం, ఎందుకంటే దానిపై అభ్యర్థి ఎంపిక యొక్క విశ్వసనీయత ఆధారపడి ఉంటుంది. అందుకే అసలు ఏయే డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలో అఫీషియల్ నోటిఫికేషన్లు పెద్ద లిస్టు ఇచ్చారు. కావున వీలైతే ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ చూడండి. నన్నడిగితే ప్రస్తుతానికి ఏమి అవసరం లేదు. ఎందుకంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ప్రాంతీయ భాష పరీక్ష అయిత తర్వాత మాత్రమే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతాయి కాబట్టి దానికి ఇంకా చాలా సమయం ఉంది.
నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) వంటి ప్రతిష్టాత్మక సంస్థలో అసిస్టెంట్‌గా చేరాలనే మీ కలను నేరవేర్చుకోవడానికి ఇదే సరైన అవకాశం! ఈ ఉద్యోగం మీకు స్థిరమైన వృద్ధికి మంచి వేదికను అందిస్తుంది. అంతేకాకుండా, భారతదేశంలోని అతిపెద్ద బీమా సంస్థలలో ఒకటైన NICLలో మీరు పనిచేయడం సమాజంలో మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది. ఈ ఎంపిక ప్రక్రియ ద్వారా మీ నైపుణ్యాలను నిరూపించుకుని, NICL కుటుంబంలో భాగస్వామి అయ్యే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఇంకెందుకు ఆలస్యం? నేడు దరఖాస్తు చేసుకోండి మరియు మీ కెరీర్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లండి!