డిగ్రీ అర్హతతో IDBIలో 1000 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు | IDBI Executive Recruitment 2024

బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలని అనుకునేవారికి ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI)లో ఎగ్జిక్యూటివ్ (సేల్స్ అండ్ ఆపరేషన్స్)గా పనిచేసే అమూల్యమైన అవకాశం వదులుకోకండి. 06 నవంబర్ 2024న IDBI బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (IDBI Executive Recruitment 2024) వెలవరించింది. ఈ ESO పోస్టుల కోసం 1000 ఖాళీలు ఉన్నాయి. మీకు ఈ జాబ్‍కు సెలక్ట్ అయితే నెలకు రూ. 29,000 జీతం అందుకుంటారు. కానీ ఇది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కాదు. ఇది కేవలం ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల కాలపరిమితితో కాంట్రాక్ట్ ఆధారంగా తీసుకోబడుతుంది. కావున దీనిని మీరు దృష్టిలో ఉంచుకోండి.

ఈ జాబ్‍కు విద్యార్హత కేవలం ఏదైనా డిగ్రీ కావడంవల్ల, చాలామంది డిగ్రీ చదివినవారు ఉంటారు కాబట్టి ఈ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల గురించి ఒకసారి ఆలోచించండి. నెలకు రూ.29,000 జీతం వస్తుందంటే ఎందుకు వదులుకుంటారు. మీరు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అయితే నవంబర్ 7 నుండి నవంబర్ 16, 2024 వరకు అధికారిక IDBI రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ www.idbibank.in ద్వారా మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిగ్రీ అర్హతతో IDBIలో 1000 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు | IDBI Executive Recruitment 2024

ఈ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO) ఉద్యోగం కేవలం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. అంటే, ఈ ఉద్యోగంలో చేరినప్పుడు మొదట ఒక సంవత్సరపు కాలపరిమితి ఉంటుంది. మీరు ఆ ఏడాది మంచి పనితీరు కనబరిస్తే, బ్యాంక్ సూచించిన కొన్ని ఈ-సర్టిఫికేషన్లు పూర్తి చేస్తే, మరియు ఖాళీలు అందుబాటులో ఉంటే, ఈ కాంట్రాక్టును మరో సంవత్సరం పొడిగించే అవకాశం ఉంటుంది. అంటే, మొత్తంగా రెండు సంవత్సరాలు ఈ ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఉంటుంది. అదనంగా, ఈ రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ పూర్తిచేసిన తర్వాత, బ్యాంక్ నిర్వహించే ప్రత్యేక ఎంపిక ప్రక్రియ ద్వారా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM), గ్రేడ్ ‘O’ స్థాయి ఉద్యోగానికి అర్హత పొందే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా మీ పనితీరు, బ్యాంక్‌లో ఉన్న ఖాళీలు మరియు ఇతర ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

IDBI Executive Recruitment 2024 – ముఖ్యాంశాలు:

ఈ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్లో ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అది మొత్తం 29 పేజీలు ఉంది. మీరు ఈ నోటిఫికేషన్‍ను చదవాలని అనుకుంటే దాని లింక్‍ను కూడా క్రింద ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులోని ముఖ్యమైన పాయింట్స్‍ని మీకు అర్థమయ్యే విధంగా క్రింద పట్టికలో ఇవ్వడం జరిగింది.

రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI)
పరీక్ష పేరు ఎగ్జిక్యూటివ్ (సేల్స్ అండ్ ఆపరేషన్స్) రిక్రూట్మెంట్ 2024
కేటగిరీ బ్యాంక్ జాబ్
పోస్టు పేరు ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO)
అర్హత వయస్సు 20 నుండి 25 సంవత్సరాల మధ్య
ఖాళీలు 1000
ఉద్యోగ వ్యవధి ఒకటి లేదా రెండు సంవత్సరాలు
వేతనం రూ.29,000/-
దరఖాస్తు విధానం ఆన్‍లైన్‍లో
దరఖాస్తు ఫీజు SC/ST/దివ్యాంగులు – ₹250
మిగతా వారు – ₹1050/-
దరఖాస్తు ప్రారంభ తేదీ నవంబర్ 07, 2024
దరఖాస్తు ముగింపు తేదీ నవంబర్ 16, 2024
ఆన్‌లైన్ టెస్ట్ తేదీ డిసెంబర్ 1, 2024
విద్యార్హత ఏదైనా డిగ్రీ
ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్
పరీక్ష మోడ్ ఆన్‌లైన్
పరీక్ష నిర్వహించే భాష ఇంగ్లీష్, హిందీ
ప్రశ్నల రకం ఆబ్జెక్టివ్ (బహుళైచ్ఛిక ప్రశ్నలు – MCQs)
అప్లై లింక్ ఇక్కడ క్లిక్ చేయండి
నోటిఫికేషన్ (PDF) ఇక్కడ క్లిక్ చేయండి
అఫీషియల్ వెబ్‌సైట్ ఇక్కడ క్లిక్ చేయండి

వేతనం/ జీతం:

IDBI బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ (సేల్స్ అండ్ ఆపరేషన్స్) పోస్టుకు అప్లై చేయాలనుకునే వారు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ ఉద్యోగం పూర్తిగా కాంట్రాక్టు పద్ధతిలో ఉండి, మొదటి సంవత్సరం నెలకు రూ. 29,000 వేతనం కల్పించబడుతుంది, రెండవ సంవత్సరం ఇది రూ. 31,000కు పెరుగుతుంది. అయితే, DA, HRA వంటి అలవెన్సులు లేదా గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, సూపరాన్యుయేషన్ వంటి ఇతర ప్రయోజనాలు ఈ ఉద్యోగానికి వర్తించవు. ఈ కాంట్రాక్టు కాలం భవిష్యత్తులో మీరు పూర్తి స్థాయి ఉద్యోగానికి ఎంపికైనప్పటికీ, సీనియారిటీ, సూపరాన్యుయేషన్, టెర్మినల్ బెనిఫిట్స్, లేదా నిరంతర సేవలలో లెక్కించబడదు. కాబట్టి, ఈ ఉద్యోగం తాత్కాలికమని గమనించాలి.

ఖాళీల సంఖ్య:

ఈ రిక్రూట్మెంట్ దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి, విపరీతమైన పోటీని ఎదుర్కొనక తప్పదు. అందుకే ముందుగా ఎన్ని ఖాళీలు ఉన్నయి అని తెలుసుకోవడంవల్ల మనకు ఈ ఉద్యోగంపై మనకు కొంచెం ఆశ ఉంటుంది. వివరమైన ఖాళీల వివరాలు, రిజర్వేషన్ కేటగిరీలతో సహా, అధికారిక నోటిఫికేషన్‌లోని మొదటి పేజీలో అందుబాటులో ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 1000 ఖాళీలు ఉన్నాయి. కేటగిరీ వారీగా:

  • జనరల్ (General): 448 ఖాళీలు
  • ఎస్.టి (ST): 94 ఖాళీలు
  • ఎస్.సి (SC): 127 ఖాళీలు
  • ఓ.బి.సి (OBC): 231 ఖాళీలు
  • ఈ.డబ్ల్యూ.ఎస్ (EWS): 100 ఖాళీలు
  • పిడబ్ల్యుబిడి (PwBD): 40 ఖాళీలు
  • మొత్తం: 1000 ఖాళీలు

విద్యార్హత:

దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ముందు మీకు సరైన విద్యార్హత ఉందని నిర్ధారించుకోండి. ఈ రిక్రూట్‌మెంట్‌కు అర్హత సాధించడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంచి ఏదైనా డిగ్రీ/ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అది కూడా వారు అక్టోబర్ 1, 2024నాటికి తమ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అలాగే కేవలం డిప్లొమా మాత్రమే ఉండే వాళ్ళు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

అర్హత వయస్సు:

  • కనిష్ట వయస్సు: అక్టోబర్ 1, 2024 నాటికి అభ్యర్థి వయసు కనీసం 20 సంవత్సరాలు ఉండాలి. అంటే, అభ్యర్థి అక్టోబర్ 1, 2004 లేదా అంతకు ముందు జన్మించి ఉండాలి.
  • గరిష్ట వయస్సు: అక్టోబర్ 1, 2024 నాటికి అభ్యర్థి వయసు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండాలి. అంటే, అభ్యర్థి అక్టోబర్ 2, 1999 తర్వాత జన్మించి ఉండకూడదు.

దరఖాస్తు ఫీజు:

మీరు ఈ ఉద్యోగానికి ఆన్‍లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా 2024 నవంబర్ 7 నుండి నవంబర్ 16 వరకు ఆన్‌లైన్‌లో ఈ ఫీజును చెల్లించాలి. SC/ST/PwBD అభ్యర్థులు అయితే కేవలం రూ. 250 చెల్లించాలి. వీరు మినహా మిగతా అభ్యర్థులు రూ. 1050 చెల్లించాలి.

ఎంపిక విధానం:

IDBI బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ (సేల్స్ అండ్ ఆపరేషన్స్) పోస్టు కోసం నిర్వహించే నియామక ప్రక్రియ అనేక దశలను కలిగి ఉంటుంది. ఈ దశలు అభ్యర్థుల అర్హత మరియు పోస్టుకు సరిపోయే అనుకూలతను అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. ఈ నియమక దశలు ఈ క్రింది విధంగా ఉంటాయి;

  1. ఆన్‌లైన్ పరీక్ష (OT):
    • ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో నిర్వహించబడుతుంది. అంటే ప్రశ్నపత్రం ఈ రెండు భాషలలో మాత్రమే ఉంటాయి.
    • అలాగే ఆబ్జెక్టివ్ పద్ధతిలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి.
    • ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గించబడతాయి. అంటే నాలుగు తప్పు సమాధానాలు గుర్తిస్తే ఒక మార్కును మీకు వచ్చిన మార్కుల నుండి తగ్గిస్తారు.
    • కట్-ఆఫ్ మార్కులు ఖాళీల సంఖ్య ఆధారంగా నిర్ణయించబడతాయి.
  2. డాక్యుమెంట్ నిర్ధారణ (DV):
    • ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ దశకు అర్హులు అవుతారు.
    • అభ్యర్థులు సమర్పించిన అన్ని అర్హతలను నిర్ధారించడం ఈ దశలో జరుగుతుంది.
  3. వ్యక్తిగత ఇంటర్వ్యూ (PI):
    • డాక్యుమెంట్ నిర్ధారణలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
    • ఇంటర్వ్యూ మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
    • కనీస అర్హత మార్కులు 50% (SC/ST/OBC/PWD అభ్యర్థులకు 45%).
  4. ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ (PRMT):
    • ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ టెస్ట్‌కు హాజరు కావాలి.
    • ఈ టెస్ట్‌లో అభ్యర్థుల ఆరోగ్యం పరీక్షించబడుతుంది.

దరఖాస్తు విధానం:

IDBI బ్యాంక్ 1 లేదా 2 సంవత్సరాల కాంట్రాక్టు ఆధారిత ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. కావున అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుసరించాల్సిన దశలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  1. IDBI బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.idbibank.in
  2. “CAREERS/CURRENT OPENINGS” విభాగాన్ని క్లిక్ చేయండి.
  3. “Recruitment of Executives – Sales and Operations (ESO)” ఎంపికను ఎంచుకోండి.
  4. “APPLY ONLINE” బటన్‌పై క్లిక్ చేయండి.
  5. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా నింపండి:
    • మీ వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, అనుభవం (ఉంటే) మరియు ఇతర అడిగిన వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి.
    • మీ వద్ద సరైన వ్యక్తిగత ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్ ఉంటే ధృవీకరించండి.
  6. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
  7. దరఖాస్తు ఫీజును చెల్లించండి.
  8. దరఖాస్తును సమర్పించండి.

ముఖ్యమైన విషయాలు:

  • దరఖాస్తు చేసుకునే తేదీ: 2024 నవంబర్ 7 నుండి నవంబర్ 16 వరకు.
  • ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్: పరీక్షకు సంబంధించిన కాల్ లెటర్లు మరియు ఇతర ముఖ్యమైన సమాచారం మీకు నమోదు చేసిన ఇమెయిల్ ID లేదా మొబైల్ నంబర్‌కు పంపబడతాయి. కాబట్టి, ఈ వివరాలు సరైనవిగా ఉండేలా చూసుకోండి.
  • డాక్యుమెంట్లు: దరఖాస్తు చేసేటప్పుడు అడిగిన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి.
  • దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

సలహాలు:

  • దరఖాస్తు చేసే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి.
  • దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసేటప్పుడు త్వరపడకండి.
  • అన్ని వివరాలను సరిగ్గా నమోదు చేయండి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోండి.
  • దరఖాస్తును సమర్పించే ముందు మరోసారి తనిఖీ చేయండి.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు అప్లై చేయండి!

మరింత సమాచారం కోసం, IDBI బ్యాంక్‌ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. లదా ఈ ఆర్టికల్ లో పైన ఇవ్వబడిన నోటిఫికేషన్ లింక్ ద్వారా అధికారిక నోటిఫికేషన్‍ను డౌన్లోడ్ చేసుకుని పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top