కొంకణ్ రైల్వేలో 190 అప్రెంటిస్ ఉద్యోగాలు | Konkan Railway Apprentice Notification 2024

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) కు సంబంధించిన మహారాష్ట్ర, గోవా మరియు కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ స్టేషన్లు మరియు పని ప్రదేశాలలో అప్రెంటిస్‍గా పని చేయాలనుకునే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నవారు లేదా జనరల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు KRCL 190 ఖాళీలకు సంబంధించి 3 అక్టోబర్ 2024న విడుదల చేసిన కోంకణ్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్‌ (Konkan Railway Apprentice Notification 2024) గురించి తెలుసుకోవాల్సిందే.

ఒకవేళ 2020, 2021, 2022, 2023, 2024లలో మీరు ఇంజనీరింగ్‌ డిగ్రీ, డిప్లొమా లేదా సాదారణ డిగ్రీ లను పూర్తి చేసి, మీ వయస్సు 18 నుండి 25 మధ్య ఉంటే మీరు ఈ ఒక సంవత్సరం పాటు ఉండే అప్రెంటిస్ ట్రైనింగ్ ను మిస్ చేసుకోకండి. ఇంతకి అప్రెంటిస్ అంటే ఏమిటో చాలామందికి తెలియదు. అప్రెంటిస్ అంటే, ఒక ప్రత్యేక రంగంలో శిక్షణ పొందుతున్న వ్యక్తి. వారు అనుభవం, నైపుణ్యాలు సంపాదించుకోవడానికి మరియు వృత్తి జీవితం ప్రారంభించడానికి శిక్షణా కార్యక్రమంలో చేరుతారు. వీటిని ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ సంస్థలు నిర్వహిస్తు ఉంటాయి. సాధారణంగా, ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఈ శిక్షణా సమయంలో, వారు వాస్తవ పర్యవేక్షణలో పనిచేసి, ప్రాక్టికల్ అనుభవం పొందుతారు. ఈ విధంగా, అప్రెంటిస్‌గా ఉన్నప్పుడు వారు ఆ రంగంలో ఎంతగానో నేర్చుకుంటారు మరియు వారి కెరీర్‌ను అభివృద్ధి చేసుకునే ఒక మంచి అవకాశాన్ని పొందుతారు.

అంటే అప్రెంటిస్‍గా సెలెక్ట్ అయిన వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్టు కాదు. వారు కేవలం ఒక సంవత్సరం పాటు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ సంస్థల్లో పని చేసి, తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. అప్రెంటిస్‌గా పనిచేయడం ద్వారా వారు ప్రాక్టికల్ అనుభవాన్ని పొందుతారు, ఇది వారి కెరీర్‌లో చాలా ఉపయోగపడవచ్చు. అంతేకాక, వారు అప్రెంటిస్ సమయంలో ప్రతి నెల జీతంగా స్టైపెండ్ ను పొందుతారు, అయితే ఈ మొత్తం చాలా తక్కువ ఉంటుంది. కానీ, ఈ అనుభవం మరియు శిక్షణ చేసిన సర్టిఫికేట్ తరువాత భవిష్యత్తులో వారు వేరే ఉద్యోగాలను అన్వేషించేటప్పుడు చాలా ఉపయోగ పడతాయి. కావున ఆసక్తి మరియు అర్హత ఉన్న వారు అక్టోబర్ 3, 2024 నుండి నవంబర్ 2, 2024 వరకు konkanrailway.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

కొంకణ్ రైల్వేలో 190 అప్రెంటిస్ ఉద్యోగాలు | Konkan Railway Apprentice Notification 2024

ఈ ఆర్టికల్‍లో కోంకణ్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్‍కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు అర్థమయ్యే విధంగా సరళంగా వివరించడం జరిగింది. ఇది అఫీషియల్ నోటిఫికేషన్లో ఇంగ్లీష్ లో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్‍ని కూడా కింద ఇవ్వడం జరుగుతుంది. కావున ఇంకా ఎక్కువ విషయాలు ఈ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకోవాలంటే మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చదవవచ్చు.

Konkan Railway Apprentice Notification 2024 – ముఖ్యాంశాలు:

8 పేజీల అఫీషియల్ నోటిఫికేషన్ లో ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇంగ్లీష్ లో ఇవ్వడం జరిగింది. దానిలోని ముఖ్యమైన పాయింట్స్ ను ఈ క్రింది పట్టికలో ఇవ్వడం జరిగింది. కావున దీనిని చదివి ఈ రిక్రూట్మెంట్ పై పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకోండి.

రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL)
పరీక్ష పేరు కోంకణ్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024
కేటగిరీ తాజా ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టు పేరు అప్రెంటిస్
అర్హత వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య
ఖాళీలు 190
ఉద్యోగ వ్యవధి ఒక సంవత్సరం
వేతనం/స్టైపెండ్ రూ.4,000/- నుండి రూ.4,500/-
దరఖాస్తు విధానం ఆన్‍లైన్‍లో
దరఖాస్తు ఫీజు SC/ST/ మహిళలు/ మైనారిటీలు/ EWS – ఫీజు లేదు
మిగతా వారు – రూ.100/-
దరఖాస్తు ప్రారంభ తేది అక్టోబర్ 03, 2024
దరఖాస్తు ముగింపు తేది నవంబర్ 02, 2024
విద్యార్హత ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా, జనరల్ గ్రాడ్యుయేషన్
ఎంపిక ప్రక్రియ మార్కుల ఆధారంగా
అప్లై లింక్ Link-1 | Link-2
నోటిఫికేషన్ (PDF) ఇక్కడ క్లిక్ చేయండి
అఫీషియల్ వెబ్‌సైట్ ఇక్కడ క్లిక్ చేయండి

కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) గురించి:

మనం ఒకవేళ అప్రెంటిస్‍గా సెలెక్ట్ అయితే కేఆర్‌సీఎల్ కు చెందిన స్టేషన్లు మరియు పని ప్రదేశాలలో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా ఈ కేఆర్‌సీఎల్ గురించి కొంత తెలుసుకుందాం. 19 జులై 1990లో స్థాపింబడిన కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) అనేది భారత ప్రభుత్వ రంగ సంస్థ, ఇది కొంకణ్ రైల్వే (Konkan Railway)ను నిర్వహించడమే కాకుండా ఇతర రైల్వే సంబంధిత ప్రాజెక్టులను కూడా చేపడుతుంది. ఈ సంస్థ భారత ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది మరియు రైల్వే మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో పనిచేస్తుంది. KRCL యొక్క ప్రధాన కార్యాలయం నవీ ముంబైలోని CBD బేలాపూర్‌లో ఉంది.

KRCL, మహారాష్ట్ర, గోవా మరియు కర్ణాటక రాష్ట్రాల తీరప్రాంత జిల్లాలను కవర్ చేస్తూ, అరేబియా సముద్ర తీరాన్ని అనుసరించే రైల్వే మార్గాన్ని నడుపుతుంది. ఇది ప్రయాణికులకు ఉత్తమమైన అనుభవాన్ని అందించడానికి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ, సమర్థవంతమైన రైల్వే సేవలను అందించడానికి ప్రయత్నిస్తోంది. KRCL స్థానిక ఆర్థిక అభివృద్ధికి, పర్యాటకానికి మరియు ప్రజల అనుసంధానానికి కీలక పాత్ర పోషిస్తోంది, దీని ద్వారా ఇది భారతదేశంలో ముఖ్యమైన రైల్వే సంస్థగా గుర్తింపును పొందింది.

వేతనం/ జీతం:

కోంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) ప్రభుత్వం అందించే స్టిపెండ్‌ను Apprentices కు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో చెల్లించడానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) వ్యవస్థను అమలు చేస్తుంది. గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు ప్రతి నెల రూ.4500/- మరియు డిప్లొమా పట్టాదారులకు రూ.4000/- చెల్లించబడుతుంది. అభ్యర్థులు శిక్షణ కాలంలో తమకు అవసరమైన వసతి/భోజన ఏర్పాట్లు చేసుకోవాలి. KRCLలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/టెక్నిషియన్ అప్రెంటిస్‌గా నమోదయిన అభ్యర్థి తన పేరులో బ్యాంకు ఖాతా మరియు PAN కార్డు కలిగి ఉండాలి. స్టిపెండ్‌ను సాఫీగా అందించడానికి, అభ్యర్థి శిక్షణ ముగిసే వరకు అదే ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ఉంచాలి.

ఖాళీల సంఖ్య:

ఇక ఖాళీల విషయానికి వస్తే, గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమాలోని ప్రత్యేక విభాగాలు మరియు కేటగరీల ఆధారంగా ఈ అప్రెంటీస్ ఖాళీలను విభజించారు. మొత్తం 190 ఖాళీలు ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ రాత పరీక్ష లేకుండా, కేవలం అభ్యర్థుల మార్కుల ఆధారంగా జరుగుతుంది, అందువల్ల ఎక్కువ మార్కులు సాధించిన వారు అప్రెంటిస్‌గా ఎంపిక చేయబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విభాగాల ఆధారంగా ఖాళీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • సివిల్ ఇంజనీరింగ్ – 30
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 20
  • ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ – 10
  • మెకానికల్ ఇంజనీరింగ్ – 20
  • డిప్లొమా (సివిల్) – 30
  • డిప్లొమా (ఎలక్ట్రికల్) – 20
  • డిప్లొమా (ఎలక్ట్రానిక్స్) – 10
  • డిప్లొమా (మెకానికల్) – 20
  • సాధారణ డిగ్రీ – 30
  • మొత్తం – 190

విద్యార్హత:

ఈ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకునే వారు ఇంజినీరింగ్ (సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్) లో గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా (సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్) లేదా సాధారణ డిగ్రీని పూర్తి చేసినవారై ఉండాలి. విద్యార్హత గురించి పూర్తి సమాచారం కొరకు అఫీషియల్ నోటిఫికేషన్ లోని పేజీ నంబర్ 2 ను చూడండి లేదా మా ఇంకొక వెబ్‍సైట్ అయిన సౌళ జాబ్‌ను సందర్శించండి.

అర్హత వయస్సు:

దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీస వయసు 1 సెప్టెంబర్ 2024నాటికి 18 నుంచి 25 మధ్య ఉండాలి. ఎవరైతే 1 సెప్టెంబర్ 1999 మరియు 1 సెప్టెంబర్ 2006 మధ్యన జన్మించి ఉంటారో వారు మాత్రమే ఈ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే, ప్రత్యేక కేటగరీల వారికి కూడా తమ వయస్సును సడలించుకునే వెసలుబాటు ఉంటుంది, కాని దానికి సంబంధించి సరైన దృవపత్రాలు సమర్పించుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

అలాగే, దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే, SC/ST/ మహిళలు/ మైనారిటీలు/ EWS కు చెందిన అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన పనిలేదు. వీరు ఎలాంటి ఫీజు లేకుండా తమ అప్లికేషన్‌ను ఆన్ లైన్‌లో సమర్పించుకోవచ్చు. ఇక, వీరు మినహా మిగిలిన ప్రతి కేటగరీల వారు తప్పక దరఖాస్తు ఫీజుగా రూ.100 రూపాయలను చెల్లించవలసి ఉంటుంది. ఈ ఫీజును కేవలం ఆన్ లైన్‌లో మాత్రమే చెల్లించాలి మరియు ఇది నాన్ రిఫెండబుల్.

ఎంపిక విధానం:

ఈ కోంకణ్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024 ఎంపిక విధానం కింది విధంగా ఉంటుంది:

  • అర్హతలు మరియు దరఖాస్తు సమర్పణ: అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా విద్యార్హతలను మరియు వయస్సు పరిమితులను బట్టి అర్హత పొందాలి. దరఖాస్తు ఫారమ్స్ ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
  • ఎంపిక క్రిటీరియా: ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష లేకుండా జరుగుతుంది. అభ్యర్థులకు వచ్చిన మార్కులను మరియు విద్యార్థుల అర్హతలను పరిగణనలోకి తీసుకుంటారు.
  • మార్కుల ఆధారంగా ఎంపిక: అర్హత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా, అత్యధిక మార్కులు పొందిన అభ్యర్థులు అప్రెంటిస్‌గా సెలెక్ట్ అవుతారు.
  • సమాన అర్హత కలిగిన అభ్యర్థులు: అర్హత మార్కుల విషయంలో సమానంగా ఉన్న అభ్యర్థుల కోసం, వయస్సు ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
  • షార్ట్‌లిస్టింగ్: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుండి అర్హత కలిగిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
  • మెరిట్ లిస్ట్: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను వారి అర్హతల ఆధారంగా మెరిట్ లిస్ట్‌లో ఉంచుతారు.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్: మెరిట్ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులు తమ అసలు డాక్యుమెంట్లను వెరిఫికేషన్‌కు హాజరు కావాలి.
  • తర్వాతి ప్రక్రియ: ఎవరైతే డాక్యుమెంట్లను వెరిఫికేషన్‌లో సరైన దృవ పత్రాలను సమర్పిస్తారో వారు ఇక అప్రెంటీస్ గా సెలెక్ట్ అయినట్టే.

ఈ విధంగా, అభ్యర్థులు తమ అర్హతలు, మార్కులు మరియు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక అవుతారు. కావున మీరు 2020 మరియు 2024 మధ్యన గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండి, మిగిలిన ఇతర అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఈ కోంకణ్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024 కు దరఖాస్తు చేసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top